Home » Music » Vedam Anuvanuvuna Nadam II Sagara Sangamam II 1984 II M D Pallavi II Ajay Warriar at BGU

Vedam Anuvanuvuna Nadam II Sagara Sangamam II 1984 II M D Pallavi II Ajay Warriar at BGU

Written By Mee, Veturi on Monday, Nov 09, 2020 | 08:09 AM

 
సాగర సంగమం, 1984 రచన: వేటూరి సుందర రామ మూర్తి సంగీతం: ఇళయరాజా గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ పల్లవి: వేదం అణువణువున నాదం నా పంచప్రాణాల నాట్యవినోదం నాలో రేగే ఎన్నో హంసానందిరాగాలే || వేదం || చరణం: సాగర సంగమమే ఒక యోగం... సాగర సంగమమే ఒక యోగం క్షారజలధులే క్షీరములాయె ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయె పదములు తామే పెదవులు కాగా...2 గుండియలే అందియలై మ్రోగా ||వేదం || మాతృదేవోభవా పితృదేవోభవా... ఆచార్యదేవోభవా... అతిథిదేవో భవా... చరణం: ఎదురాయె గురువైన దైవం మొదలాయె మంజీరనాదం గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణైపోయె జీవం నటరాజపాదాల తలవాల్చనా నయనాభిషేకాల తరియించనా ||2|| సుగమము రసమయ ||2|| నిగమము భరతముగాదా ||వేదం || జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరామరణ జం భయం ||2||