Home » News & Politics » Margadarsi Chit Fund Case | జస్టిస్‌ ఎస్‌ వి భట్‌ లేని ధర్మాసనానికి మార్గదర్శి కేసుల బదిలీ

Margadarsi Chit Fund Case | జస్టిస్‌ ఎస్‌ వి భట్‌ లేని ధర్మాసనానికి మార్గదర్శి కేసుల బదిలీ

Written By ETV Telangana on Tuesday, Jul 18, 2023 | 11:32 PM

 
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను తెలంగాణ హైకోర్టు విచారించడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎస్ .వి. భట్ ... లేని ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ అనిరుద్ధ బోస్ ఆదేశించారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్స్ ఫర్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనంపై ఉన్న జస్టిస్ భట్ ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పడంతో ఆ కేసులను ఆయన సభ్యుడిగా లేని ధర్మాసనానికి బదిలీచేయాలని జస్టిస్ అనిరుద్ధ బోస్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులను రెండువారాల పాటు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోరగా, అందుకు మార్గదర్శి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ కేసు పెండింగ్ లో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఉన్న కేసులు విచారణకు రాకుండా పదేపదే మెమోలు దాఖలు చేస్తోందని తెలిపారు. వాళ్లు అక్కడ కేసుల విచారణను వాయిదా వేస్తున్నారని మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. మార్గదర్శి తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుంటూ వచ్చే శుక్రవారం విచారణ చేపట్టాలని కోరారు.. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------