విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?
** రాత్రికి రాత్రే గోనె సంచులు ఎలా వచ్చాయి?
** వర్షాలు ముందుగానే ధాన్యం సేకరించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు
** ప్రణాళిక లేని విధానం వల్లే ఈ పరిస్థితి
** నష్టపోయిన ప్రతి గింజకు పరిహారం వచ్చే వరకు పోరాడుతాం
** తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం ల్, అవిడి గ్రామంలో మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి వేదన విన్నారు. ఈ సందర్బంగా మీడియా తో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ " దారి పొడుగునా రైతులను కలిసాం. వారంతా చెప్పేది ఒక్కటే. మేం దోపిడీలు, దొంగతనాలు.. అవినీతి చేయలేదు. కాంట్రాక్టులు చేయలేదు. నలుగురికి అన్నం పెట్టే మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా పంట కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాం అని చెప్తున్నారు. వర్షాలు రాకముందే పంట ను కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో దాదాపు అకాల వర్షాల దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరి జిల్లాలో వరి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేస్తే, 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు.
రాత్రికి రాత్రి గోతాలు రావడం విచిత్రం
విపక్ష పార్టీలు రైతుల కోసం గొంత్తెత్తితే గానీ ప్రభుత్వంలో చలనం లేదు. క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితిని విపక్షాలు చెబితే గానీ ధాన్యం కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇప్పటికీ ధాన్యం సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఇప్పటివరకు గోతాలు ఇవ్వని అధికారులు మేము వస్తున్నాం అని తెలియగానే రాత్రికి రాత్రి గోతాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది. కొనుగోళ్లు హడావుడిగా చేస్తున్నారు. రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అన్నారు.
రైతుల్లో భరోసా నింపేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ పీఏసీ ఛైర్మన్
ఈ సందర్బంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ "అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రభుత్వం వారికి సాయపడేలా ఏమాత్రం స్పందించడం లేదు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయి పర్యటన చేస్తున్నారు. రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని ఈ ప్రభుత్వ విధానాలు మారాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఈ ప్రాంతంలో అధికారులు అప్పటికప్పుడు హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు వేగం పెరగాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి" అన్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పి గన్నవరం నియోజకవర్గంలోని రాజుల పాలెం గ్రామంలో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : https://www.facebook.com/PawanKalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party :
To Donate : https://janasenaparty.org/donations
Other official Social media Links :
https://www.facebook.com/janasenaparty
https://twitter.com/janasenaparty
https://www.instagram.com/janasenaparty
#JanaSenaParty #PawanKalyan