దేశంలో మరో విమానయాన సంస్థ..నష్టాల సుడిలో చిక్కుకుంది. ఇంజిన్ల సమస్యలతో గోఫస్ట్ సంస్థ ఆధీనంలోని 57 విమానాల్లో 28 ఎగరలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ నెల 3 నుంచి 5 వరకు సర్వీసులకు నిలిపివేసింది. ప్రయాణికులకు నగదు పూర్తిగా వాపసు ఇస్తామని పేర్కొంది. ఆర్థిక సమస్యలతో దివాలా పరిష్కార ప్రక్రియ కోసం జాతీయకంపెనీ లా ట్రైబ్యూనల్-NCLT దిల్లీ బెంచ్ కి.......... స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంది. గోఫస్ట్ కు అనుకూలంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును..అమెరికా ఇంజిన్ల సంస్థ ప్రాట్ అండ్ విట్నీ పాటించకపోవడంతో..ఇంతటి తీవ్ర నిర్ణయానికి వచ్చింది. NCLT తమ దరఖాస్తును అంగీకరిస్తే....... విమానాలు మళ్లీ నడుపుతామని గోఫస్ట్ తెలిపింది. PW నుంచి ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగానే ఆర్థిక కష్టాలు తీవ్రమైనట్లు... గోఫస్ట్ CEO కౌశిక్ కోనా తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.... 3,4, 5 తేదీల్లో సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించిన గోఫస్ట్ కు..DGCA షోకాజ్ నోటీసులు జారీచేసింది. అకస్మాత్తుగా గోఫస్ట్ విమానాలను రద్దుచేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమను వేరే విమానాల్లో పపించాలంటూ సిబ్బందితో వాదనకు దిగారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------