Home » News & Politics » DGCA Shocks To Go First Air Lines | Stops Ticket Booking Systems Immediately

DGCA Shocks To Go First Air Lines | Stops Ticket Booking Systems Immediately

Written By ETV Andhra Pradesh on Monday, May 08, 2023 | 08:51 AM

 
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గోఫస్ట్ ఎయిర్ లైన్స్ కు....పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్-DGCA షాకిచ్చింది. తక్షణమే బుకింగ్‌లు....టికెట్ల విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు బుకింగ్‌లు చేపట్టవద్దని తెలిపింది. సురక్షితంగా, సమర్థవంతంగా, నమ్మకంగా వినియోగదారులకు సేవలు అందించడంలో గోఫస్ట్ విమానయాన సంస్థ విఫలమైందని D.G.C.A. తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులకు 15రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గోఫస్ట్ ఎయిర్ లైన్స్ వివరణ ఆధారంగా.... ఆ సంస్థ లైసెన్స్ కొనసాగించటంపై నిర్ణయం తీసుకుంటామని D.G.C.A.స్పష్టం చేసింది. ఇప్పటికే ఈనెల 12వరకు విమానాలను రద్దు చేసిన గోఫస్ట్ ....15వ తేదీ వరకు టికెట్ల విక్రయాన్ని నిలిపివేసింది. వాడియా గ్రూప్‌నకు చెందిన గోఫస్ట్ ఎయిర్ లైన్స్ ....గతంలో గోఎయిర్ అనే పేరుతో ఉండేది. అయితే స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కు గోఫస్ట్ విజ్ఞప్తి చేసింది. కొవిడ్ కారణంగా తీసుకున్న రుణాల నుంచి ఉపశమనం పొందేందుకు దివాలా పరిష్కారాన్ని కోరింది... ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------