Home » News & Politics » Attacks on Hindu Temples in Australia | PM Modi Discuss With Anthony Albanese

Attacks on Hindu Temples in Australia | PM Modi Discuss With Anthony Albanese

Written By ETV Andhra Pradesh on Wednesday, May 24, 2023 | 02:32 AM

 
ఆస్ట్రేలియాలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. పలు కీలక అంశాలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో చర్చించారు. ఆ దేశంలోని దేవాలయాలు తరచూ దాడులకు గురవుతున్న అంశాన్ని మోదీ... ఆల్బనీస్‌తో ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆల్బనీస్ హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని గతంలోనూ ఆస్ట్రేలియా ప్రధానితో చర్చించినట్లు మోదీ వివరించారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య గల స్నేహ పూర్వక, దృఢమైన సంబంధాలకు భంగం కలిగించే కార్యకలాపాలను సహించబోమని మోదీ తేల్చిచెప్పారు. ఇలాంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్బనీస్ హామీ ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. ఖలిస్థానీ వేర్పాటు వాదులు భారత వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన అంశాన్నీ మోదీ చర్చించారు. మూడు రోజుల పర్యటనలో పలు వాణిజ్య, రక్షణ, ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ఆల్బనీస్ తో మోదీ చర్చించనున్నట్లు సమాచారం....... ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------